2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం సంచలనం అనే చెప్పాలి. అప్పటి వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు టిడిపి పార్టీని నేలకేసి కొట్టినంత పని చేశారు సీఎం జగన్. భారీ స్థానాల్లో గెలిచి ఇక తిరుగులేని విజయాన్ని సాధించారు. ఈ క్రమంలోనే జగన్ చిరకాల వాంఛ అయిన సీఎం పీఠాన్ని అధిరోహించారు అన్న విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూనే వస్తుంది.  దీంతో చంద్రబాబుకు వరుసగా షాకుల తగులుతూనే ఉన్నాయి.



 ఇటీవలే పరిషత్ ఎన్నికల్లో కూడా వైసిపి మరోసారి అద్భుతమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి.  ప్రతి ప్రాంతంలో కూడా భారీ రేంజ్ లో స్థానాలను గెలుచుకొని ఇక ఏపీలో తమకు తిరుగులేదని మరోసారి వైసీపీ నిరూపించింది. ఈ క్రమంలోనే ఒకప్పుడు జగన్ తండ్రి వైఎస్సార్ కు సాధ్యం కానిది కూడా ఇటీవల సీఎం జగన్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు అని చెబుతున్నారు విశ్లేషకులు.  చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో టిడిపి తప్ప ఇతర పార్టీలు గెలిచిన దాఖలాలు లేవు.



 కుప్పంలో విజయం సాధించాలి అనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైయస్సార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. కానీ ఇటీవలే సీఎం జగన్ మాత్రం టీడీపీ కంచుకోట కుప్పంలో వైసీపీ జెండా ఎగరేసి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. కుప్పం,గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం 4  స్థానాల్లో కూడా వైసీపీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. అది కూడా భారీ మెజారిటీతో. ఇక అటు ఎంపీటీసీల పరంగా కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 19 ఎంపిటిసి స్థానాలకు గాను 17 ఎంపీటీసీ స్థానాలను జగన్ పార్టీ గెలుచుకోగా.. కేవలం రెండే రెండు ఎంపిటిసి స్థానాలతో సరిపెట్టుకుంది టిడిపి.  ఇలా కుప్పంలో వైఎస్ఆర్ సాధించలేనిది ఆయన కొడుకు జగన్ సాధించారని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: