ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో దూకుడు పెరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా గెలిచి తీరుతామ‌నే ధీమా.. టీడీపీ నాయ‌క‌త్వ‌లో న‌ర‌న‌రానా క‌నిపిస్తోంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌లు, ఇంచార్జ్‌లు చూపిస్తు న్న దూకుడు.. ఖ‌చ్చితంగా విజ‌యం దిశ‌గా పార్టీ న‌డుస్తోంద‌నే  వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం రెండు స్థానాల్లోనే విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు.

వీటిలో ఒక‌టి బాప‌ట్ల‌. జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి చెందిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ 1999 త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచింది లేదు. అప్ప‌ట్లో మంతెన అనంత వ‌ర్మ విజ‌యం సాధించారు. ఇక‌, త‌ర్వాత‌.. ఎంత మంది పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌లేదు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. చంద్ర‌బాబు హ‌వా వీచినా.. ఇక్క‌డ మాత్రం వైసీపీ విజ‌యం సాధించింది. ఇప్పుడు ఇక్క‌డ టీడీపీ గెలుపు స‌మీక‌ర‌ణ‌లు పుంజుకున్నాయి. బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం.. టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న వేగేశ‌న‌శ్న న‌రేంద్ర వ‌ర్మ‌.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు.


నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. పార్టీ నాయ‌కుల‌కు చేరువ‌గా మెలుగుతున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచి కూడా ఆయ‌న వేగేశ‌న‌ ఫౌండేష‌న్ ద్వారా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశారు. నీటి ఎద్ద‌డి ఉన్న ప్రాంతాల‌కు స్వ‌యంగా.. ట్యాంకులు ఏర్పాటు చేసి.. నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అదేవిధంగా.. అన్ని మతాల‌ను.. కులాల‌ను గౌర‌వించ‌డం.. వారివారి పండ‌గ‌ల స‌మ‌యంలో.. వారికి తోఫాలు.. ఆర్థిక సాయం చేయడం వంటివి వేగేశ‌న‌కు ప్ల‌స్‌గా మారాయి. ఇంటింటికి టీడీపీతో ఆయ‌న బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి గ‌డ‌పా తొక్కారు. ఒకానొక టైంలో వ‌ర్మ‌కు టిక్కెట్ ఇస్తే బాప‌ట్ల‌లో టీడీపీ గెలుపు ఖాయ‌మ‌న్న అంచ‌నాలు వ‌చ్చేశాయి.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. త‌న‌ను ప‌క్క‌న పెట్టి అన్నం స‌తీష్‌కు టికెట్ ఇచ్చినా.. నొచ్చుకోకుండా.. స‌తీష్ గెలుపు కోసం కూడా వేగేశ్న ప‌నిచేశారు. ఇక‌, స‌తీష్ పార్టీకి బై చెప్పి.. బీజేపీలోకి వెళ్లిన త‌ర్వాత‌.. పార్టీని వేగేశ్న ముందుండి న‌డిపిస్తున్నారు.  నియోజ‌క‌వ‌ర్గంలోని మూడు మండ‌లాల్లోనూ పార్టీ కార్యాల యాలు ఓపెన్ చేసి.. వారంలో ఒక్కొక్క చోటకు వెళ్తూ.. అక్క‌డి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్ని స్తున్నారు. దీంతో న‌రేంద్ర వ‌ర్మ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చంద్ర‌బాబు, లోకేష్ ద‌గ్గ‌ర కూడా మంచి మార్కులు సంపాయించుకోవ‌డం విశేషం. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 25 ఏళ్ల త‌ర్వాత‌.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
ఇక‌, టీడీపీ పాతికేళ్ల త‌ర్వాత‌.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్న నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌రావు పేట‌. ఇక్క‌డ కూడా 1999 త‌ర్వాత‌.. తెలుగు దేశం పార్టీ గెలుపుగుర్రం ఎక్క‌లేదు. అయితే.. ఇప్పుడుఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు చూస్తున్న డాక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు.. దూకుడుగా ముందుకు సాగుతు న్నారు. వాస్త‌వానికి రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం లో బీసీ నాయ‌కుడు.. డాక్ట‌ర్ అర‌వింద‌బాబుకు చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పించారు.
వైద్యుడిగా.. సామాన్య ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోయిన అర‌వింద‌బాబు..  అజాత శ‌తృవుగా గుర్తింపు పొందారు.. ఎవ‌రు ఏ ఇబ్బందుల్లో ఉన్నా.. ఆదుకోవ‌డం.. పార్టీ నేత‌ల‌ను క‌లుపుకొని పోవ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయి. ఇక‌, ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు సాధించిన‌.. వైసీపీ ఎమ్మెల్యే.. గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి.. అభివృద్ధి చేయ‌లేక  పోతున్నార‌నే వాద‌న బ‌లంగా ప్ర‌జ‌ల  నుంచి వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అర‌వింద బాబు విజ‌యం ఖాయ‌మ‌ని.. పాతికేళ్ల త‌ర్వాత‌.. పార్టీ ఇక్క‌డ జెండా ఎగ‌రేస్తుంద‌ని.. టీడీపీ సీనియ‌ర్లు కూడా అంచ‌నా వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: