ఆంధ్రప్రదేశ్లో అన్ని ఎన్నికలు వరుసగా పూర్తవుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ వైసిపి వన్ సైడ్ గా విజయం సాధిస్తోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గెలుపు వైసీపీదే. అసలు ప్రతిపక్షాలకు ఎంత మాత్రం ఛాన్స్ లేకుండా పోతుంది. బెదిరింపులు ... అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా 80 నుంచి 90 శాతం ఫలితాలు వైసీపీ వైపు ఉన్నాయి. సమైక్య రాష్ట్ర చరిత్రలోనే ఏ పార్టీకి లేనంత విజ‌యాల శాతం ఇప్పుడు వైసీపీ కి ఉంది. మ‌హా మ‌హులు అయిన ముఖ్య‌మంత్రుల‌కే సాధ్యం కాని గెలుపు వైసిపికి ఇప్పుడు ల‌భిస్తోంది.

జగన్ 2019 ఎన్నికలకు ముందులా ఇప్పుడు రాజకీయం చేయడం లేదు. ఇప్పుడు దూకుడు రాజకీయం తో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధిస్తున్నారు. విజ‌యం సాధించాల‌ని త‌మ పార్టీ నేత‌ల‌కు సీరియ‌స్ ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనాల్లోకి బాగా వెళుతున్నాయ‌న్న ఫీడ్ బ్యాక్ జ‌గ‌న్ కు ఉంది. ఇదిలా ఉంటే జగన్ అధికారుల మాటలు అస్సలు నమ్మటం లేదట.

తనకంటూ ఐదు రకాల స‌ర్వే సంస్థలను జగన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్న టు తెలుస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ సర్వేలు ... అధికారులు చెబుతున్నా సంతృప్తి నివేదికలు కూడా జగన్ ఏ మాత్రం ప‌ట్టించుకోని విషయం గా చెబుతున్నారు.

జగన్ చాలా చోట్ల ఎమ్మెల్యేల‌పై వ్యతిరేకత ఉందన్న విషయాన్ని కూడా గ్రహించినట్టు తెలుస్తోంది. మరీ ఘోరంగా ప‌నితీరు ఉన్నవారికి కొద్ది రోజులు సమయం ఇస్తారట. ఆ తర్వాత కూడా వారి పనితీరులో మార్పు లేకపోతే ... వచ్చే ఎన్నికల్లో వారిని పక్కన పెట్టేసి వారి స్థానంలో కొత్త వారికి టికెట్లు ఇస్తారని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: