ఒక్కప్పటి స్టార్ హీరోయిన్  , వైసీపీ ఫైర్ బ్రాండ్ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కు ఇప్పుడు సొంత పార్టీలోని అసమ్మతి బెడద ఎక్కువగా ఉంది. నగరి నియోజకవర్గం నుంచి రోజా 2014 - 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. రోజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్పటినుంచి నియోజకవర్గంలో ఆమెను సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగర నియోజకవర్గ వైసిపి లో ఉన్న గ్రూపులు మరోసారి రోడ్డెక్కి ర‌చ్చ చేసుకున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమె వ్యతిరేకవర్గం పోటా పోటీగా జగన్ పుట్టిన రోజు వేడుకలు చేసి బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయాల ని నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే రెండు వ‌ర్గాలు నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీ లు చించివేయడంతో పెద్ద ర‌చ్చ జ‌రిగింది. ఎమ్మెల్యే రోజా వ‌ర్గానికి చెందిన వారే ఈ ప‌ని చేశారంటూ కేజే కుమార్ వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు.

మ‌రో వైపు అస‌మ్మ‌తి నేత‌లుగా ఉన్న  ఏలుమ‌లై - కేజే కుమార్ - ల‌క్ష్మీప‌తిరాజు - భాస్క‌ర్‌రెడ్డి  - ముర‌ళీరెడ్డి - ర‌విశేఖ‌ర‌రాజు -  శ్రీ‌శైలం పాల‌క మండలి చైర్మ‌న్ చ‌క్ర‌వ‌ర్తిరెడ్డి రోజా కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన గ్రూపు ను ఏర్పాటు చేశారు. వీరికి జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి బ‌ల‌మైన స‌పోర్ట్ ఉంద‌ని అంటున్నారు.  మ‌రో వైపు రోజా నాన్ లోక‌ల్ అన్న ప్ర‌చారం కూడా గ‌ట్టిగా తీసుకు వ‌స్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓడిస్తామ‌ని కూడా వారు వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనా రోజుకు న‌గ‌రి లో మామూలు అస‌మ్మ‌తి లేద‌నే చెప్పాలి. మ‌రి ఈ అస‌మ్మ‌తి నుంచి ఆమె ఎలా ?  బ‌య‌ట ప‌డుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: