ఇప్పుడుప్పుడే ఏపీలో టీడీపీ పుంజుకుంటుంది...ఇందులో ఎలాంటి అనుమానం లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఉన్న సీన్ ఇప్పుడు మాత్రం లేదు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పికప్ అయింది. అయితే ఇంకా పార్టీని పైకి లేపడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు...అందుకే నేతలని కూడా యాక్టివ్ చేస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగించారు.

ఇదే క్రమంలో విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలో కూడా మార్పులు చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ప్రగడ నాగేశ్వరరావుని పెట్టారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయన నియోజకవర్గంలో పార్టీని పైకి లేపినట్లు కనిపించడం లేదు. మామూలుగానే ఎలమంచిలి టీడీపీకి కంచుకోట...ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో మాత్రం ఇక్కడ వైసీపీ గెలిచింది. వైసీపీ తరుపున కన్నబాబురాజు పోటీ చేసి గెలిచారు. అయితే టీడీపీ తరుపున పంచకర్ల రమేష్ బాబు పోటీ చేసి ఓడిపోయారు.

ఓడిపోయాక పంచకర్ల టీడీపీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. అయితే ఓ వైపు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది...ఎమ్మెల్యే పనితీరుకు అనుకున్న మేర మంచి మార్కులు పడటం లేదు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటంలో కూడా ఎమ్మెల్యే విఫలమైనట్లు తెలుస్తోంది. ఇలా ఎలమంచిలి వైసీపీలో నెగిటివ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వైసీపీలో ఉన్న నెగిటివ్‌ని యూజ్ చేసుకోవడంలో టీడీపీ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.

ఇంకా నియోజకవర్గంలో పార్టీ పికప్ అవ్వాలసిన అవసరం ఉంది. ప్రగడ ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ సీనియర్ నేత పప్పల చలపతిరావు కూడా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంది. గతంలో ఈయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది. కాబట్టి ప్రగడని కలుపుకుంటూ...ఎలమంచిలిలో పార్టీని పైకి లేపాలి. పైగా ఇక్కడ జనసేనకు ఓట్లు బాగానే ఉన్నాయి. ఒకవేళ జనసేన గానీ నెక్స్ట్ టీడీపీతో కలిస్తే...కాస్త ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: