ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సంక్షేమ పధకాల పేరుతో సామాన్యులకు మంచి చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మినహా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లలో చాలా మంది అవినీతి మత్తులో తూలుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇదంతా కూడా అధికారం చేతిలో ఉంది కదా అని సదరు ఎమ్మెల్యే లు ఇలా ప్రవర్తిస్తున్నారని కొన్ని మీడియా చానళ్ళు అంటున్నాయి. ఎలా గోలా ప్రభుత్వం ఏర్పాటయ్యి మూడు సంవత్సరాలకు దగ్గర పడుతోంది. దీనితో ఇలాంటి అవినీతి పరమయిన ఎమ్మెల్యే లపై వేటు తప్పేలా లేదని వార్తలు వస్తున్నాయి.

అయితే పక్కాగా ఎవరు అనేది ఇంకా తెలియక పోయినా దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఎమ్మెల్యే లపై హై కమాండ్ కు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఇష్టమొచ్చినట్లుగా ధనాన్ని కొల్ల గొడుతున్నారు. అడిగే వారు లేరనే ఇలా చేస్తున్నారని ఫిర్యాదులలో పేర్కొన్నట్లు సమాచారం. వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అడ్డ గోలుగా చేస్తున్న అవినీతి కార్యక్రమాల గురించి ఒక రాజ్యసభ సభ్యుడు సీఎం కు తెలియ చేశారట. అంతే కాకుండా ఆ ఒక్క ఎమ్మెల్యే కారణంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, ఒకసారి పిలిచి మందలించాలని సలహా ఇచ్చాడట.

అయితే ఇందుకు స్పందించిన జగన్, 'ఏం పర్వాలేదు ఈ కొద్ది రోజులే కదా.. ఎలాగూ మనము నెక్స్ట్ ఎలక్షన్స్ కు సీటు కూడా ఇవ్వము కదా వదిలేయ్ అన్నాడట... దీనితో ఆ ఎమ్మెల్యే ఎవరనే విషయం చర్చకు వస్తోంది. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు అతను చేస్తున్న దందాలు ఏవి అనేది త్వరలోనే వెలుగు లోకి రానున్నాయి. అంతే కాకుండా ఎమ్మెల్యే గురించి జగన్ కు చెప్పిన రాజ్య సభ్యుడు ఎవరనే విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది...  

మరింత సమాచారం తెలుసుకోండి: