అధికారంలోకి రాక‌ముందు విమ‌ర్శ అంటే ఒప్పుకునే వారు. విమ‌ర్శిస్తే మెచ్చుకునేవారు. అధికారంలోకి రాక‌ముందు క‌ష్టం అంటే స్పందించేవారు. మేం అధికారంలోకి వ‌స్తే క‌ష్టాలే ఉండ‌వ‌ని చెప్పారు. ఆ రోజు ఏ చెప్పినా కూడా విన‌డం, అర్థం చేసుకోవ‌డంలో జ‌గ‌న్ అనే పెద్ద మ‌నిషి హాయిగా అంద‌రి క‌న్నా ముందు వ‌రుస‌లో ఉండేవారు. అవ‌మానాలు దాటి వ‌చ్చిన విజ‌యం కార‌ణంగా ఆయ‌న ఇప్పుడు అప్ప‌టిలా లేరు. ఆయ‌న ఇవాళ ఏదీ విన‌రు మ‌రియు వినిపించుకోరు. ఆయ‌న పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాల పేరిట హ‌డావుడి చేస్తున్న తీరు కూడా ఇందుకు ఒక ఉదాహ‌ర‌ణ. అభివృద్ధి అన్న‌ది అక్క‌ర్లేని విష‌యంగా కొట్టిపారేయ్యడం ఇవాళ ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లోనే వ‌చ్చే ఓ గొప్ప మార్పు. ఆయ‌న‌కు అధికార‌మే ధ్యేయం. అందుకే ఈ ప‌థ‌కాల ప‌రంప‌ర‌!



ఆంధ్రావ‌ని రాజకీయాలలో చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ ఓ మెట్టు పైకి ఎక్కారు. ఆ విధంగా ఎదుగుద‌ల సాధించారు. ఎవ్వ‌రూ అనుకోని విధంగా ఆయ‌న సీఎం అయి 30 నెల‌లు పూర్త‌య్యాయి కూడా! ఆయ‌న సాధించిన విజ‌యాలు ఏవ‌న్న‌ది ప్ర‌తిరోజూ సాక్షి మీడియా చెబుతుంది. అవి విజ‌యాలో లేదా ఆయ‌న‌కు మాత్రమే సాధ్య‌మయిన ప్ర‌య‌త్నాలో ఇప్ప‌టిదాకా తేల‌డం లేదు. ఎందుకంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందూ వెనుకా అన్న‌ది చూడ‌కుండా ప‌థ‌కాల పేరుతో డ‌బ్బులు పంచుతూనే  ఉంది. అటు ఇటు కానీ హృద‌యం నీది ఎందుకురా ఆ తొందర నీకు అన్న పాట మాదిరిగా అస్స‌లు ఎందుకు డ‌బ్బు సంచులు విసురుతున్నారో కూడా అర్థం కావ‌డం లేదు. ఎందుకు ఈ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టి జ‌నాల‌ను కూర్చో బెట్టి మేపుతున్నారో కూడా అర్థం కాదు.అయినా కూడా రాజ‌కీయంలో అన్నీ అర్థం చేసుకోవ‌డం,అన్నీ అర్థం కావ‌డం అన్న‌వి జ‌ర‌గ‌ని ప‌నులు.


ఇక ఆ రోజు జగ‌న్ ఎలా ఉన్నారో చూద్దాం. చంద్ర‌బాబు హయాంలో వెలువ‌డిన నిర్ణయాల‌న్నింటినీ త‌ప్పు ప‌డుతూవ‌చ్చారు. నిరుద్యోగ భృతి ఎందుకు వ‌ద్దు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ  అదొక పెద్ద స్కాం అని అన్నారు కూడా! ఇలా చాలా మాట‌లు అధికారంలోకి రాక ముందు క‌లెక్ట‌రేట్ల ఎదుట దీక్ష‌ల పేరిట అంటూనే వ‌చ్చారు. ముఖ్యంగా రుణ‌మాఫీకి సంబంధించి వైసీపీ చాలా యుద్ధ‌మే చేసింది. రాజ‌ధాని పై కూడా మంచి రాద్ధాంత‌మే చేసినా అమ‌రావ‌తిని రాజ‌ధానిని చేయ‌వ‌ద్ద‌ని మాత్రం చెప్ప‌క‌పోవ‌డం విడ్డూరం.


మరింత సమాచారం తెలుసుకోండి: