రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీలు పూర్తిగా వైసీపీ వైపే ఉంటారనే సంగతి తెలిసిందే. మొదట నుంచి వారు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీకి మద్ధతుగా ఉంటూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీ పైచేయి సాధించడానికి కారణం కూడా ఇదే. అసలు 2019 ఎన్నికల్లో అయితే అన్నీ ఎస్టీ స్థానాల్లో వైసీపీ గెలిచేసింది..అలాగే ఎస్సీ స్థానాల్లో కూడా దాదాపు అన్నీ గెలిచేసింది. ఒక కొండపిలో టీడీపీ, రాజోలులో జనసేన గెలిచాయి.

అంటే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీ డామినేషన్ ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు రాజకీయం మారుతుంది...రిజర్వడ్ స్థానాల్లో సీన్ మారుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు స్థానాల్లో టీడీపీ కూడా పికప్ అవుతుంది. కానీ వైసీపీ పై వ్యతిరేకత ఉంటూ...టీడీపీకి అనుకూలంగా లేని నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణ కు చూసుకుంటే చింతలపూడి నియోజకవర్గం లో వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు అంతా అనుకూలమైన వాతావరణం లేదు. కానీ టీడీపీ పరిస్తితి కూడా బాగోలేదు.

అలాగే కొవ్వూరులో మంత్రి తానేటి వనితకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కానీ ఇక్కడ టీడీపీకి కూడా అనుకూలంగా లేదు. ఇటు అమలాపురం, పి. గన్నవరం, రాజోలు స్థానాల్లో వైసీపీకి టోటల్ రివర్స్ ఉంది. టీడీపీకి కూడా అదే పరిస్తితి. అటు గూడూరు, సూళ్ళూరిపేట నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ఈ రెండు చోట్ల టీడీపీ పరిస్తితి మెరుగు అవ్వలేదు. ఇంకా ఇక్కడ టీడీపీ పుంజుకోలేదు.

సత్యవేడు, జీడీ నెల్లూరు, పూతలపట్టు లాంటి నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్తితి అంత బాగోలేదు..అయినా ఇక్కడ టీడీపీ పరిస్తితి కూడా బాగోలేదు. అటు రైల్వే కోడూరు, కోడుమూరు, మడకశిర నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: