ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఇండియాకు ఏవైతే నష్టాలు జరగకూడదు అని భావించామో... ఇప్పుడు వరుసగా అదే జరుగుతోంది. మామూలుగా ఎక్కడైనా యుద్ధం లేదా ఏదైనా సంక్షోభం ఏర్పడితే అన్నింటికన్నా ముందుగా నిత్యావసర వస్తువుల ధరలపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మానవునికి నిత్యావసర వస్తువులలో ఒకటి అయిన పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. గత అయిదు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెరిగిన ధరలు చూస్తే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఒక బ్యారెల్ పై 5 డాలర్లు పెరిగింది.

అయితే న్యూయార్క్ మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఒక బ్యారెల్ పై 5.24  డాలర్లు పెరిగినట్లు తెలుస్తోంది. అలా యు ఎల్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరపై 5.43 డాలర్లు పెరిగి 108.60 డాలర్ లకు చేరుకుంది. ఇలా పలు అంతర్జాతీయం మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం భారత్ పై కూడా తప్పకుండా పడుతుందని తెలుస్తోంది. అయితే ఇది వాస్తవ రూపం దాల్చాలంటే ఇంకా కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం ఇండియాలో ఒక బ్యారెల్ ధర 82 నుండి 83 డాలర్ లు వరకు ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఇదే ధర అమలులో ఉంది. అయితే అంతర్జాతీయంగా దాదాపుగా 28 డాలర్లకు పెరగడంతో, ఆ ప్రకారం పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత ఉంటాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం.

ఈ లెక్కన చూసుకుంటే మనము ఊహించని విధంగా ధరలు ఉంటాయన్నది మాత్రం చెప్పగలము. మరి ఇప్పటి నుండి ప్రజలు కూడా పెరిగినప్పుడు షాక్ కు గురి కాకుండా సిద్దంగా ఉండాలి. మరియు ఇప్పటి నుండి ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ను పొదుపు చేయాలి అనే విషయంపై ఒక అంచనాకు వస్తే మరీ మంచిది. పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగినా కొనక తప్పదు కాబట్టి... తక్కువ దూరాలకు బైక్ లను వాడకుండా కాలి నడకన లేదా సైకిల్ పై వెళ్ళడం అలవాటు చేసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: