దేశంలో ఎండలు పూర్తిగా మండిపోతున్నాయి..ఎంతగా అంటే అంతగా ఉన్నాయి..మనుషులు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. ఉదయం 9 నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నారు..మొన్నటి వరకూ నైరుతి రూతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మాడు పగిలిపోయేలా ఉన్న ఎండ వేడి తాళలేక చెమట్లు కక్కుతున్నారు.ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటే బయటకు వెళ్ళాలంటే మాత్రం పెద్ద సాహసం చేయాలనీ అంటున్నారు..


రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ హాట్ సమ్మర్ లో ఇంటి నుంచి బయటకు వచ్చే సాహసం కూడా చెయ్యలేకపోతున్నారు. రాత్రి సమయంలో కూడా వేడిగాలులు వీస్తున్నాయి. ఫ్యాన్‌, కూలర్‌, ఏసీ వేసుకున్నా ఎండ తాపం తగ్గడం లేదని జనాలు వాపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయా? ఈ మండే ఎండల నుంచి ఉపశమనం కలుగుతుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమం లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు.


గత నెల 29న కేరళ ను తాకిన తర్వాత రెండు రోజుల పాటు స్తబ్దుగా మారాయి. ప్రస్తుతం మళ్లీ పుంజుకొని వేగంగానే కదులుతున్నాయి. బెంగళూరు వరకు నైరుతి రుతుపవనాలు వచ్చాయి. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కి ప్రవేశిస్తాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో జూన్ 7 లేదా 8 వరకు విస్తరిస్తాయి. ప్రస్తుత హీట్ టెంపరేచర్ రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనా లు ఎంటరయ్యే ముందు ఉష్ణోగ్రతలు ఇలాగే ఎక్కువగా ఉంటాయి.. ఈ ఏడాది కూడా సాదారణ ఉష్ణోగ్రతలు కూడా, వర్షపాతం నమోదు అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: