కేంద్రంలో బీజేపీ గత ఎనిమిది సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. గత రెండు పర్యాయాలుగా జరిగిన ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో మంచి మార్పును తీసుకువచ్చారు. దేశంలో రెండవ ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా బలహీనంగా మారిపోయింది. వాస్తవంగా చూసుకుంటే మోదీ పరిపాలన వలన జరిగిన మేలు కంటే... నష్టం ఎక్కువ అని ఫీలవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీపై ప్రజలకు విపరీతమైన వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ వ్యతిరేకత నుండి బీజేపీ ఈజీగా బయటపడుతోంది. అందుకు కారణం వారు అవలంభిస్తున్న మరియు పాటిస్తున్న నియమాలు అని చెప్పాలి.

ఇక ఎంతోకాలంగా తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ తరం కాని ఒకే ఒక్క అంశం దక్షిణ భారతదేశంలో అధికారంలోకి రావడం. అందులో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , తమిళనాడు , కేరళ మరియు కర్ణాటక లు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులతో బీజేపీకి సత్సంభందాలు ఉన్నది.. ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ తో బాగానే ఉంది. కానీ పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. సో... దీనిని బట్టి ఏపీలో బీజేపీ అభివృద్ధి చెందే అవకాశాలు చాలా తక్కువ. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న విషయం బట్టి బీజేపీ స్టెప్ ఉంటుంది.

ఇక తమిళనాడు లో డీఎంకే పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే, సీఎం స్టాలిన్ సైతం అద్భుతమైన పాలనను అందిస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇతను ఉన్నంతవరకు బీజేపీకి ఇక్కడ అవకాశాలు తక్కువే. మరో దక్షిణాది రాష్ట్రము కేరళ లో కూడా సిపిఎం పార్టీ అధికారంలో ఉంది. సీఎం గా ఉన్న పినరయి విజయన్ సుసంపన్నమైన పాలనను అందిస్తున్నాడు. తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో ఏమైనా కొన్ని సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప అధికారంలోకి రావడం అనే విషయం కలలో మాటే. ఒక్క కర్ణాటకలో మాత్రం బలమైన పార్టీ లేకపోవడంతో బీజేపీ ఆటలు సాగుతున్నాయి. ఇలా పోల్చుకుంటే కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుంది మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ఎదురుదెబ్బలు తప్పవు.    

మరింత సమాచారం తెలుసుకోండి: