ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో కేసీఆర్ ని గట్టిగా విమర్శించేది ఎవరంటే తప్పకుండా రేవంత్ రెడ్డే గుర్తుకు వస్తాడు.. అయితే కాంగ్రెస్ లో సీనియర్ ల నుంచి వస్తున్న వత్తిడి తో అయన కొత్త పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొక ప్రాంతీయ పార్టీ టీఆరెస్ కు గట్టి పోటీ ఇస్తుందని చంద్రబాబు సలహాతో రేవంత్ రెడ్డి ఈ పార్టీ ని పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే తెలంగాణ లో ని టీడీపీ నేతలందరూ టచ్ లో ఉన్నారని తెలుస్తుంది.. ఇక తన సామజిక వర్గం పై జరుగుతున్న అన్యాయాలను వెల్లడించి వారిని తనవైపు తిప్పుకునేలా చేసుకుంటున్నారట..