చంద్రబాబు ఏమాత్రం మర్యాద ఉన్నా పీవీ నరసింహ రావు పేరును ఒక ఏపీ జిల్లాగా పెట్టించేలా ఉద్యమం చేయాలి అని సోషల్ మీడియా లో ఓ వార్త సెన్సేషనల్ అవుతుంది.. ఎందుకంటే చంద్రబాబు కి ఎన్టీఆర్ వెన్నుపోటు విషయంలో పీవీ చేసిన సహాయం అలాంటిది.. ఎన్టీఆర్ కి పీవీ కి ఎంతో స్నేహం ఉన్నా మామ అల్లుళ్ళ వ్యవహారంలో మౌనంగానే ఉన్నారు.. అప్పటి గవర్నర్ తో కూడా రాజ్యాంగం ఎలా ఉంటే అలాగే కానివ్వండి అని చెప్పారట.. దాంతో చంద్రబాబు కి పరోక్షంగా పీవీ నుంచి సపోర్ట్ దక్కిందని అంటున్నారు.. ఆవిధంగా చూస్తే చంద్రబాబు కి ఏమాత్రం మర్యాద ఉన్నా దీనిపై ఉద్యమం చేసైనా సరే జగన్ ని ఒప్పించాలని కొందరు పీవీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..