ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు రోజు రోజుకి తన విలువని దిగజార్చుకునే విధంగా పనులు చేస్తున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంలో ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉన్నా ఆయన దానికి ఉపయోగించకుండా ముందుకు పోతుండడం రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ ఊర్లో వీధులు శుభ్రం లేకపోయినా, ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడా కూల్చివేయబడినా సరే చంద్రబాబు తన ఆయుధమైన ట్విట్టర్ లో వైసీపీ కి వ్యతిరేకంగా పిట్ట కూతలు కూయడం ప్రారంభిస్తారు.. అదే పని తన టీడీపీ నేతలతో చేయిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.