తెలంగాణాలో ఎమ్మార్వో నాగరాజు ఉదంతం పై కేసీఆర్ సమీక్ష చేసి మొత్తం రెవెన్యూ చట్టాన్నే ప్రక్షాళన చేయాలనీ ఆలోచిస్తున్నారట.. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో మొదలవ్వబోయే అసెంబ్లీ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చే విధంగా పోరాటం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఓ ముసాయిదా రెడీ ఉందట.. సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టి దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది..