ప్రస్తుతం గతంలో ఎప్పుడు లేనటువంటి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సంక్షోభానికి కారణం అప్పులు చేయడం మాత్రమే కాదు రాష్ట్రంలో వచ్చే నెలసరి ఆదాయం కూడా భారీగా పడిపోవడమని నిపుణులు చెప్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ లో ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి.. గత ఆగస్టు నెలలో తెలంగాణ ఆదాయం రూ. పదమూడు వేల కోట్ల వరకూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మూడు వేల కోట్లకు అటూ ఇటూగానే ఉంది.