ఓడిపోయిన ప్రతి సారి చంద్రబాబు తాను మారాను.. మళ్ళీ నమ్మండి అంటూ ప్రజల వద్దకు వచ్చి దీన స్థితిలో ఉండి అడిగేవారు. ఇప్పుడు కూడా అలాంటి మభ్యపెట్టే ప్రయత్నమే ఎల్లో మీడియా తో కలిసి చేస్తున్నారు.. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో పార్టీ ఓడిపోతే ఎంతో దీనస్థితిలో పేస్ పెట్టి అయ్యోపాపం అనిపించేలా నటించడం చంద్రబాబు కు అలవాటు.. అలానే ఈసారి నేతలతో , కార్యకర్తలతో మాట్లాడుతూ తప్పంతా తన మీద వేసుకుని ఇక మీదట అలా జరగదు పార్టీ ని పట్టించుకోకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైంది ఇక మీదట అలా జరగనీయను అని నంగనాచి కబుర్లు చెప్తూ వారిని, మీడియా ద్వారా ప్రజలను మళ్ళీ బుట్టలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు..