దేశంలోని అన్ని రాష్ట్రాలలో, సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.. భవిష్యత్ లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అన్న పరిస్థితి వచ్చింది.. అలాంటి పార్టీ కి కష్టం వచ్చిందని కాంగ్రెస్ వచ్చి అడిగితే జగన్ ఎలా వస్తారనుకున్నారో ఏమో కాంగ్రెస్ ఇప్పుడు సెంట్రల్ కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలవాలని అడుగుతున్నారు..సెంట్రల్ లో అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడలేదు.. ఇప్పుడు సెంట్రల్ లేదు, రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి అసలు లేదు. అలాంటి సమయంలో జగన్ సఖ్యత గానే ఉన్న బీజేపీ ని కాదని కాంగ్రెస్ కు ఏమాత్రం సపోర్ట్ చేయరనేది వైసీపీ పార్టీ నేతల వాదన..