టీడీపీ పరిస్థితి ఇప్పుడెలా తయారైంది అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులా అయ్యింది.. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పటికే టీడీపీ నేతలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు..ఇప్పటికే ప్రజలు మరో ముప్పై ఏళ్ళు టీడీపీ ని నమ్మే పరిస్థితి లేదని అర్థమైపోయింది.. దాంతో చంద్రబాబు తన టైం అయిపోయే లోపు కొడుకు లోకేష్ ని రాజకీయంగా బలవంతుడిని చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు లోకేష్ ని పక్కనపెట్టి జూనియర్ ఎన్టీఆర్ ని లైన్ లోకి తీసుకురావాలని సూచించాడు. లేకపోతే టీడీపీ పార్టీ గెలవడం కల అని అయన అన్నారు