తెలంగాణా లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.. పలు అంశాలపై చర్చించిన కేసీఆర్ ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశంశల జల్లు కురిపించారు.. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్య శ్రీ చాలా బెటర్ అని అన్నారు.. ఆరోగ్యశ్రీ తో పోల్చితే ఆయుష్మాన్ భారత్ పధకంతో నష్టం వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మాటతో కేసీఆర్ కాంగ్రెస్ ను అభిమానించే ప్రజల మనసుని మరొకసారి గెల్చుకున్నారు..