ఫిరాయింపుల పర్వంలో మొదటగా చెప్పుకోవాల్సిన లీడర్ గిడ్డి ఈశ్వరి.. టీచర్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆమె పాడేరు నియోజకవర్గం నుంచి 2014 లో వైసీపీ తరపున గెలుపొందారు. వాస్తవానికి జగన్ ఎంపిక చేసిన ఆమెలో దూకుడు స్వభావం ఎక్కువే.. ఆమె చేజేతులా చేసుకున్న పాపం ఈవిధంగా పండింది.. అయితే టీడీపీ లో అయినా ఆమెవెంట అందరు వెన్నంటి ఉన్నారా అంటే అధిక శాతం మంది కార్యకర్తలు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. దీంతో ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అన్నట్లు ఆమె ఒంటరిగా మిగిలిపోయారు..