రాష్ట్రంలో బీచ్ అందాలు చూడాలన్నా, ఏజెన్సీ ప్రకృతి సోదాలు చూడాలన్న ప్రతి ఒక్కరు విశాఖ కి రావాల్సిందే. అందుకు తగ్గట్లే జగన్ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అడుగులేస్తున్నారు అని తెలుస్తుంది.. విశాఖ ను మరింత ప్రకృతి సిద్ధంగా మార్చే ఆలోచన చేయడం అక్కడివారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. విశాఖ బీచ్ రోడ్డు ను మరింత అందంగా తీర్చిదిద్దాలనేది అక్కడి కల దాన్ని జగన్ సాకారం చేస్తున్నారు.. ఇక అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా రానుండడంతో జగన్ ఇప్పటికే విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.