కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సీఎం జగన్ మేనమామ.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రాజకీయ నాయకుడు.. ఇప్పటివరకు ఈయన ఏనాడూ వార్తల్లో నిలవలేదు.. కారణం అయన మృదు స్వభావుడు అని అందరు అంటుంటారు.. ఈయన మంచి తనానికి అధికార పక్ష నేతలే కాదు ప్రతిపక్ష నేతలు కూడా ఫిదా అయిపోతుంటారు.. అందుకే ఆయన నియోజక వర్గంలో అంతా ఒక్కటే అన్న భావన ప్రచారంలో ఉంది.