బాబు హయాంలో రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం , దండాలు జోరుగా సాగాయి. అంతమాత్రాన ఈ పోరాటంలో రైతులే లేరు అని ఏమాత్రం చెప్పలేం.. వారిని ఎందుకు ఈ ప్రభుత్వం గుర్తించడం లేదు అన్నది ఇన్నాళ్ళూ మేధావులకు వచ్చిన పెద్ద ప్రశ్న. ఇపుడు ఎవరు చెప్పారో తెలియదు కానీ ప్రభుత్వం కళ్ళు తెరచింది. రైతులతో చర్చలకు రెడీ అవుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.