గత కొన్ని రోజులుగా కేసీఆర్ బీజేపీ ప్రభుత్వం పై ఘరమ్ ఘరమ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా జీఎస్టీ పరిహారం విషయంలో అయన కేంద్ర ప్రభుత్వం పై తీవ్రమైన కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మొదటినుంచి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్నీ దాటవేసే ప్రయత్నం చేస్తున్నది. చట్ట ప్రకారం రాష్ట్రాలకు ఆదాయం తక్కువ వచ్చినప్పుడు జీఎస్టీ పరిహారం చెల్లించాలి కానీ కరోనా గాడ్ అఫ్ యాక్ట్ కింద లెక్కకట్టి ఇవ్వాల్సిన జీఎస్టీ చెల్లింపులను ఎగ్గొట్టింది.. నిధులు కావాలంటే ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకోవాల్సిందేనని సూచించగా దీన్ని కేసీఆర్ కొంత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.