ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పార్టీ ని బలోపేతం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు.. ఎప్పుడు చూసిన అధికారంలోకి వచ్చిన జగన్ ను విమర్శించడమే సరిపోయింది.. ప్రతి పథకంలో లేని తప్పులు వేలెత్తి చూపుతూ వైసీపీ ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు కానీ తమను ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేశారో ఆలోచించలేదు.. దాంతో ప్రజల్లో టీడీపీ రోజు రోజు కి దిగజారిపోతుందన్న భావన టీడీపీ నేతల్లో ఎక్కువైంది.. అయితే చంద్రబాబు కు అది చేరవేసి ముందు పార్టీ ని వచ్చే ఎన్నికల నాటికి బలపరుచుకోవాలని చెప్పగా చంద్రబాబు మొదటి సారి పార్టీ బలోపేతం దిశగా అడుగులేయడం మొదలుపెట్టారు..