జగన్ పై కాంగ్రెస్ నేత శంకరరావు, టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, కింజారపు ఎర్రన్నాయుడులు కేసులు వేసి అయన పెట్టిన ఇబ్బందుల సంగతి అందరికి తెలిసిందే.. లక్ష కోట్లు దొచారని, అవినీతికి పాల్పడ్డారని,భూ కబ్జాలు చేశారని చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలు జగన్ ను తీవ్రంగా ఆరోపించారు. ఇవన్ని తట్టుకుని జగన్ వేసిన కేసుల్లో ఎలాంటి నిజం లేదని నిరూపించుకుని, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఎదిగారు.. ఈ విధంగానే చంద్రబాబు చేస్తే బాగుండేది అని టీడీపీ సైతం అనుకుంటున్నా ఎవరిమాట వినని చంద్రబాబు తన మొండితనం తో మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ని కోల్పోయారు..