రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మతానికి సంబందించిన రాజకీయాలు ఎక్కువయిపోతున్నాయి.. వాస్తవానికి గతంలో ఎప్పుడు లేనంతగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.. ఇటీవలే అంతర్వేది ఆలయ రథ దగ్ధం పూర్తి గా మర్చిపోకముందే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఉన్న మహా మండపం వద్ద అమ్మవారి రథానికి ఉన్న నాలుగు వెండి సింహాలలో మూడు చోరీకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభుత్వం వీటి విచారణలో ఉండగానే మరో ఘోరం రాష్ట్రంలో జరిగింది.. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సాయిబాబా ఆలయంలో విగ్రహం ధ్వంసం అయ్యింది.