ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు కార్యక్రమాలకు అడ్డుపుల్లలు వేస్తూనే ఉంది. అంతేకాదు నీరు గార్చే ప్రయత్నం చేశారు..అయితే ఆ అడ్డుపుల్లలవల్లే జగన్ ఇంత సమర్ధవంతంగా పనిచేశారు..``బాబు అడ్డు పడకపోతే.. మాకు జగన్ ఎప్పుడు ఇచ్చేవాడని`` అనే టాక్ వచ్చేలా చేసింది. మొత్తంగా చూస్తే.. ప్రతిపక్షంగా బాబు ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టాలని చూస్తున్నా.. సరైన విధానం లేకుండా సాగుతున్న ఈ వ్యతిరేకత.. ఆఖరుకు ఆయనకే నష్టం కలిగించేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.