ఢిల్లీ లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీ ల నేతలు తమ ఎజెండా ను చెప్పే విషయంలో ఒకరితో ఒకరికి పొంతన లేకుండా పోతుందట.. ఒకరు రాష్ట్రం కోసం పోరాడుతూటే మరొకరు కోర్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పార్లమెంట్ సమావేశాల్ని ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో రెండు రాష్ట్రాల ఎంపీలు ధర్నాలు చేశారు. అయితే ఒకే అంశంపై కాదు. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన బకాయిల కోసం నిరసన చేపట్టారు. ఏపీ ఎంపీలు మాత్రం అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని.. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాల కోరుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల దృష్టిలో ఇరు రాష్ట్రాలు కొంత చిన్నబోయినట్లు అనిపిస్తుంది..