హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టకుండా.. ఇతర చోట్ల కట్టిన లెక్కలు చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారని .. 5 నియోజకవర్గాల్లో కేవలం 3,400 ఇళ్లే కట్టినట్లుగా తేలిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పటికైనా లక్ష ఇల్లు చూపిస్తే మేము తప్పకుండా చూడడానికి వస్తామని చెప్తున్నారు.. అసెంబ్లీలో చేసిన సవాల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భట్టి ఇంటికి వెళ్లిన తలసాని…ఇళ్లను పూర్తిగా చూపించకుండానే మధ్యలో వెళ్లిపోయి… కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చారు.