వ్యవసాయ బిల్లును సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తుండడంతో మోడీ ని వ్యతిరేకించే వారికి ఇదొక ఆయుధం గా మారిపోయింది.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ని రైతులు ఈ బిల్లును వ్యతిరేకించడం మొదలు పెట్టారు.. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో నాయకులూ ఎలాంటి విమర్శలు చేయకున్నా ప్రజలు మాత్రం నిరసన సెగలు పుట్టిస్తున్నారు.. ప్రతిపక్ష నాయకుల దూకుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిత్ర పక్షాలైతే మోడీ పై గుర్రుగా ఉన్నాయి..