కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రం చేసినట్లుగానే జగన్ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తూ వస్తుంది. అయితే టీడీపీ ఎంపీ లు మాత్రం పార్లమెంట్ లో అదేదో మునుపెన్నడూ టీడీపీ అప్పులు చేయలేదన్నట్లు గళం విప్పడం తో ప్రజలు టీడీపీ వారిపై సెటైర్లు వేస్తూ సమాధానం చెప్తున్నారు.. గన్ సర్కార్ సంపద సృష్టించకుండా, ఆదాయం పెంచకుండా అప్పులు చేస్తోందని, రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తోందని బూటకపు ఆవేదన వ్యక్తం చేశారు.