దేవాలయాల పై దాడులు ఎన్ని ఏళ్న నుంచి మనం చూస్తే ఉన్నాం.. ఒక్క వైసీపీ హయాంలోనే కాదు చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి.. అయితే అప్పుడు రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఈ ఇష్యూ ని పట్టించుకోకుండా వేరే ఇష్యూలపై ఫోకస్ పెట్టింది.. అయితే అప్పటి మీడియా కూడా దేవాలయాల దాడుల విషయం ఎక్కువగా ఫోకస్ కానివ్వకుండా చేస్తూ ప్రొజెక్టు చేయకపోవడంతో పెద్దగా విమర్శలు రాలేదని అంటున్నారు. అప్పట్లోనూ.. క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని, చర్చిలను కూలగొడుతున్నారని.. అప్పట్లో బాబు సర్కారుపై ఆరోపణలు వచ్చాయి. అయితే అవి తమ బలంతో పెద్దగా బయటకి పొక్కనివ్వలేదు..