వాసుపల్లి గణేష్ వైసీపీ లో తన కుమారులను చేర్చిన సంగతి తెలిసిందే.. దీనిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం పై టీడీపీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత.. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, కంభంపాటి రామ్మోహన్రావులు.. బీజేపీలో చేరినప్పుడు ఇదే చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఇప్పుడెందుకు ఆవేశపడుతున్నారనే అభిప్రాయం వారిలో ఉంది.. దీని వెనుక ఎలాంటి కోణం ఉందొ చెప్తున్నారు.. బీజేపీ లోకి వెళ్లిన వారిని విమర్శిస్తే తమకే ఇబ్బంది అలా కాకుండా వైసీపీ లోకి వెళ్లిన వారిని విమర్శిస్తే బీజేపీ కి దగ్గరావొచ్చని చంద్రబాబు వేసిన ప్లాన్ కి అందరు ఆశ్చర్యపోతున్నారట..