మంత్రి గా ఉంటూ అందరిని చూసుకోవలసిన బాలినేని జిల్లాలో నాయకులను ఆయన పట్టించుకోవడం లేదని, తమ గోడు వినిపించుకోవడం లేదని నాయకులు వాపోతున్నారు. కేవలం కొందరికి మాత్రమే బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉంటున్నారని పెద్దగానే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఓ ఎమ్మెల్యే తన సమస్యను చెప్పి సీఎం అప్పాయింట్మెంట్ ఇవ్వాలని కోరగా బాలినేని దీనికి తాను చాలు సీఎం జగన్ ఎందుకు అని సదరు నాయకుడికి తానే అప్పాయింట్మెంట్ ఇవ్వడం మానేశారు.