ఎంపీ గల్లా లోక్సభలో.. అమరావతిని మార్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వాపోయారు. మరి ప్రజలందరూ ఆందోళనతో ఉంటే.. అమరావతి ఉద్యమం కనీసం రాజధాని ప్రాంతమైన 29 గ్రామాల్లోనూ ఎందుకు జరగడం లేదన్నదానికి టీడీపీ నేతల వద్ద సమాధానం ఉండదు. అమరావతి ఉద్యమం ప్రస్తుతం నాలుగైదు గ్రామాలకే పరిమితమై విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినా.. కూడా టీడీపీ నేతలు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలకు ఆపాదించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉండడం విశేషం.