ఎన్నికల్లో పార్టీ అధికారంలో కి వచ్చే విధంగా సోము తన సైన్యాన్ని రెడీ చేస్తున్నారు.. అయితే అధికారంలోకి వచ్చాక ఎలాంటి అయోమయం ఉండకూడదని ఇప్పటినుంచే ఏపీ ని ఎలా అభివృద్ధి చేయాలి అని ప్రణాళికలు వేసుకుంటున్నారట.. దానికి ఆయన పెట్టిన పేరు సమృధ్ ఆంధ్ర”..!. అంటే…  తెలుగు రాష్ట్రమైనప్పటికీ..  ఢిల్లీ నాయకులకు అర్థమవ్వాలని హిందీలో పెట్టినట్లుగా ఉన్నారు. ఆంధ్రను సంవృద్ధిగా అభివృద్ధి చేస్తామని సోము వీర్రాజు ఈ పేరు ద్వారా చెప్పదల్చుకున్నట్లుగా ఉన్నారు. అధికారంలోకి రాగానే… సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో..దేశంలోనే ఆదర్శంగా తయారు చేస్తామని ప్రకటించారు.