రోజా.. ఫైర్ బ్రాండ్.. వైసీపీ పార్టీ లో మహిళా నేతల్లో బలమైన లీడర్ ఎవరంటే రోజా పేరు తప్పకుండా చెప్పొచ్చు.. తన విమర్శలతో సీఎం గా ఉన్న చంద్రబాబు నే అప్పట్లో గడగడలాడించింది. చంద్రబాబు ను ఎవరైనా గట్టిగా విమర్శించారంటే అది రోజా ఒక్కరే అని చెప్పాలి.. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు వెలిచారు.. 2014 లో గాలి ముద్దు కృష్ణమ నాయుడు పై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన రోజా 2019 అయన వారసుడు గాలి భాను ప్రకాష్ మీద భారీ మెజారిటీ తో గెలిచారు..