కూల్చివేతలకు గురైన దేవాలయాల నిర్మాణానికి జగన్ ఇప్పుడు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ మేరకు దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో ప్రకటన చేశారు. పుష్కరాలకు సంభందం లేకపోయినా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో పురాతన దేవాలయాలను కూల్చేశారని. ప్రస్తుత ప్రభుత్వం ఆనాడు కూల్చేసిన ఆ పురాతన దేవాలయాలను పునర్నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుందని. కూల్చివేసిన గుడులలో కొన్నిటిని తిరిగి యధాస్థానంలో నిర్మించేందుకు, మరికొన్నిటిని స్థలం వెసులుబాటుని బట్టి కాస్త పక్కన నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుందని త్వరలోనే ఈ కూల్చివేసిన గుడుల పునర్నిర్మానం కార్యక్రమం కార్యరూపం దాల్చబోతుందని చెప్పుకొచ్చారు.