బీజేపీ, జనసేన పార్టీ లకు అసలు పొసగడం లేదట.. అందుకు కారణం రెండు పార్టీ లకు వేరువేరుగా విధి విధానాలు ఉండడమే అంటున్నారు.. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో రెండు పార్టీ లకు ఏమాత్రం ఒకే అభిప్రాయం కుదరట్లేదట. గత ఏడాది డిసెంబర్ నుంచి మొదలైన మూడు రాజధానుల వ్యవహారం శాసన ప్రక్రియ కూడా ముగించుకుని ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తోంది. ఒకట్రెండు నెలల్లో మూడు రాజధానులు కార్యరూపం దాల్చడంపై క్లారిటీ వస్తుంది. ఈలోగా ఈ అంశంపై అన్ని పార్టీ లు ఒక వివరణ వేరు వేరు గా ఇవ్వాలని ఉత్తర్వులు జరీ చేసింది.. ఈ వివరణలో జనసేన ఒక రాజధానికే మద్దతు పలకగా బీజేపీ మాత్రం మూడు రాజధానులకు మద్దతు తెలుపి జనసేన మాటను లెక్క చేయట్లేదట.