విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలోనే విశాఖ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు.. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని ఆరోపించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వారు ఇప్పుడు విశాఖలో జరుగుతున్నదాన్ని ఏమంటారని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనితో రాజధాని ప్రకటించక ముందు జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ కి, ప్రకటించిన తర్వాత జరిగే ఇన్ సైడర్ ట్రేడింగ్ కి చాలా తేడా ఉందని సీనియర్ నేత, మంత్రిగా పని చేసిన అయ్యన్న కు ఇది కూడా తెలీదా అని అంటున్నారు..