టీడీపీ హయాంలో విద్యుత్ మీటర్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని, దాదాపు 41 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆ నివేదిక లో ఉంది. ఈ స్కాం లో మొత్తం 12 మంది పై కేసు నమోదు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే వీరు ఎలాంటి రాజకీయ అండ లేకుండానే ఇదంతా చేశారు అంటే ఎవరు నమ్మరు.. ఇన్ని కోట్ల వ్యవహారం అంటే ఖచ్చితంగా ఈ స్కాం గురించి చంద్రబాబు కు తెలిసే ఉంటుంది అంటున్నారు.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకట్రావ్ ఇతర రాజకీయ నేతలు ఈ స్కాములో ఉన్నారనే విధంగా విచారణ జరుపుతున్నారు.. ఇదే కనుక రుజువైతే చంద్రబాబు ఈ స్కాములో కూడా జైలుకి వెళ్ళాక తప్పదేమో..