టీవలే వైసీపీ లోకి వచ్చిన విశాఖ ఎమెల్యే వాసుపల్లి గణేష్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. పార్టీ లోని లోపాల్ని, చంద్రబాబు విధానాల్ని తప్పుపట్టే విధంగా అయన మాట్లాడడంతో టీడీపీ లో ఇన్ని లోపాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. అమరావతి కి మద్దతుగా విశాఖ లో ఉద్యమం చేయమని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు.. స్థానిక ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా లేని ఉద్యమాలు చేయమంటే ఎలా చేయగలమని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి టీడీపీ నాశనానికి చంద్రబాబు అసలు కారణం అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదని తెలుస్తుంది.