టీటీడీ మాజీ చైర్మన్ , దివంతగత ఆదికేశవుల నాయుడి కొడుకు శ్రీనివాసులు కూడా టీడీపీ ని వీడెందుకు రంగం సిద్ధమయ్యింది. ఇటీవలే తిరుమల పర్యటన లో ఉన్న జగన్ ను పద్మావతి అతిధి గృహంలో ముఖ్యమంత్రిని కలిసి తన మనసులో మాట చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబం గా డీకే ఆదికేశవులు నాయుడు వివిధ పార్టీలలో రాజకీయంగా చక్రం తిప్పారు. పార్లమెంట్ సభ్యుడిగానూ, వ్యాపార వేత్తగానూ, టీటీడీ చైర్మన్ గానూ కీలక హోదాలలో క్రియాశీలకంగా కనిపించారు. అలాంటి నేతను చంద్రబాబు కోల్పోవడం టీడీపీ కి పెద్ద మైనస్ అని చెప్పాలి..