సాధారణంగా ఏ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీ అధినాయకులపై ఈగ వాలినా ఊరుకోరు. రాజకీయ పరంగా వచ్చే ఎటువంటి విమర్శలనైనా వెనువెంటనే తిప్పకొట్టేస్తుంటారు. అయితే ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కన్పిస్తోందంటున్నారు విశ్లేషకులు. ప్రధాని నరేంద్రమోదీపై కనీసం ఈగ కూడా వాలనీయకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చూసుకోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఈ జాగ్రత్త ఎదో అప్పుడే ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని కొంతమంది అభిప్రయడుతున్నారు..