రాష్ట్రంలో బీజేపీ పార్టీ చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే వచ్చేసారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేస్తుందా ఏంటి అన్న అనుమానాలు, ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నాయి.. వైసీపీ ప్రభుత్వాన్ని కాదని ప్రజలు ఏమాత్రం ఆ తప్పు చేయరని ఒకవైపు గట్టి నమ్మకంతో ఉన్నా బీజేపీ పార్టీ ఇప్పుడు కొత్తగా అవలంభిస్తున్న విధానాలు చూస్తుంటే ఎన్నికల సమయానికి ప్రజల్లోకి దూసుకుపోవడం ఖాయమనిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రజల సమస్యలపై ఇంత పోరాటం చేస్తున్న బీజేపీ మొన్నటి ఎన్నికల సమయంలో ఎక్కడిపోయింది అని ప్రజలు బీజేపీ ని ప్రశ్నిస్తున్నారు..