దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేస్తుందని పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది కానీ ఉపఎన్నికలను నిర్వహించాలని మాత్రం నిర్ణయించుకోలేదు. కొద్ది రోజుల బీహార్ అసెంబ్లీతో పాటే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 60కి పైగా అసెంబ్లీ స్థానాలను కూడా భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చెప్పింది.