ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి తెచ్చుకునేందుకు చంద్రబాబు ఇప్పటికే కొన్ని వ్యూహరచనలు చేశారని తెలుస్తుంది.ఈ వ్యూహం గతి తప్పిన టీడీపీని సరైన దారిలో నడిపిస్తుందని, పునర్ వైభవం తెచ్చేలా దోహదపడుతుందని పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఆ వ్యూహాల్లో ఒకటి జగన్ ప్రభుత్వ వ్యతిరేక పనులు చేయడం ఒక కాన్సెప్ట్ కాగా, ఇంకోటి చెదిరిపోయిన ఓటు బ్యాంకును చేరువ చేసుకోవడం, మరొకటి ఇతర పార్టీ లకు కదిలిపోయిన తమ్ముళ్లను తిరిగి సైకిల్ ఎక్కించుకోవడం. మరి ఇప్పటికే పలుమార్లు చైన్ తెగినా సైకిల్ కు రిపైర్ చేసిన చంద్రబాబు ఈ సారి గదిలోకి తెస్తాడా చూడాలి..