చంద్రబాబు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటో అప్పుడే మర్చిపోయారనుకుంటా.. అందుకే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఇప్పటినుంచే పగటి కలలు కంటున్నారు.. అసలు ప్రజలు ఏ కారణం చేత ప్రతిపక్షానికి పంపారో దాన్ని ఇంకా సరిదిద్దుకోకముందే అప్పుడే ప్రజలకు వైసీపీ పట్ల వ్యతిరేఖత వచ్చేసింది అని చెప్పుకోవడం బాబు రాజకీయ అవిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఓ వైపు జగన్ సంక్షేమ పథకాలను ఎంతో పారదర్శకంగా అమలుపరుస్తూ ముందుకు వెళ్తుంటే చంద్రబాబు వాటి మీద విమర్శలు చేసి ఇంకా ఇంకా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు తప్పా తమ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చెయ్యట్లేదు..